ICC World Cup 2019:MS Dhoni left social media awestruck as he helped Bangladesh in setting the right field during the ICC World Cup 2019 warm-up game in Cardiff on Tuesday.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#klrahul
#dineshkarthik
#cricket
#teamindia
మ్యాచ్‌ని విజయవంతంగా పూర్తి చేయడం... ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేయాలో వికెట్ల వెనుక నుంచి బౌలర్లకు సలహాలు ఇవ్వడం... మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేసే పనులు. అయితే, తాజాగా ప్రత్యర్ధి జట్టు ఫీల్డర్‌కు కూడా ధోని సూచన చేయడం విశేషం.
వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా మంగళవారం కార్ఢిప్ వేదికగా జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ధోని సెంచరీతో చెలరేగాడు. ధోని ఆడిన తీరు చూస్తే ప్రత్యర్ధి జట్టు బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ సిక్సులు మీద సిక్సులు బాదాడు.
ఈ క్రమంలో ధోని 78 బంతుల్లో 113 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ధోని సిక్స్‌తో సెంచరీని అందుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108(12 ఫోర్లు, 4 సిక్సులు) కూడా సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 359 పరుగులు చేసింది.